ఈ దసరాకి నూజివీడులో రెండు ఎక్సిబిషన్లు | Two Exhibitions in Nuzvid This Year

ఈ దసరాకి నూజివీడులో రెండు ఎక్సిబిషన్లు | Two Exhibitions in Nuzvid This Year

October 8, 2018 Off By nuzvidthemangocity

నూజివీడు దసరా అంటేనే సంబరాలకు, జాతరాలకు, ఆటలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజలు దసరా పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకుంటారు. నూజివీడు దసరా లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది “ఎక్సిబిషన్”. దసరా నవరాత్రులలో అందరూ ఫామిలీ తో ఫ్రెండ్స్ తో వెళ్లి ఇక్కడ బాగా ఆనందం గా గడుపుతారు. ఈ సంవత్సరం దసరా లో రెండు ఎక్సిబిషన్లు పెట్టడం ఎంతో ఆసక్తి గల విషయం. దసరా రోజున ఎక్సిబిషన్ దగ్గర ఎంతో రద్దీగా ఉండటం అందరికి తెలిసిందే. కానీ రెండు ఎక్సిబిషన్లు పెట్టడం వల్ల ప్రజలకి ఇంకా సరదాగా గడపడానికి మరియు ఎక్కువ ఆటలు ఆడటానికి అవకాశం దోరకచ్చు. ఈ రెండు కూడా హనుమాన్ జుంక్షన్ రోడ్ లొనే పక్కపక్కనే ఉంటాయి.

ఏది ఏమైనా ఈ దసరా కి ప్రజలు ఇంకా ఉత్సాహంగా గడపచ్చు అనడంలో సందేహం లేదు.

309 total views, 3 views today