నూజివీడులో కూరగాయల సంత | Open vegetable market in Nuzvid

నూజివీడులో కూరగాయల సంత | Open vegetable market in Nuzvid

October 16, 2018 Off By nuzvidthemangocity

నూజివీడులో ఇక నుంచి ప్రతి సోమవారం మరియు గురువారం మార్కెట్ యార్డులో కూరగాయల సంత జరగనుంది. రైతులు నేరుగా తమ కూరగాయలను ఇక్కడ అమ్ముకునే ఏర్పాటు జరగనుంది. ఈ మార్కెట్ ను MP మాగంటి బాబు గారు ప్రారంభించారు.

ఈ మార్కెట్ వలన రైతులకు మరియు వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ విధానంతో దళారీ వ్యవస్థ వల్ల జరిగే అక్రమాలను తొలగించి రైతులకు లాభదాయకంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముద్దరబోయిన వెంకటేశ్వరావు, కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న రైతు బజారులో ఉన్న రేట్ కన్నా ఎక్కువ వేసి అమ్మడం జరుగుతుంది. ఈ మార్కెట్ కూడా మంచి ఆశయం తోనే మొదలు పెట్టిన దీని నడిపించే విధానం లో ఎటువంటి మార్పులు జరుగుతాయో చూడాలి. రైతులకు మేలు జరుగుతుందని ఆశిద్దాం.

359 total views, 6 views today