నూజివీడు మామిడి – అందని ద్రాక్ష

నూజివీడు మామిడి – అందని ద్రాక్ష

April 20, 2019 Off By nuzvidthemangocity

నూజివీడు పేరు వినగానే ఎవరికైనా గుర్తు వచ్చేవి తియ్యటి మామిడి రసాలు. ఇక్కడ పండించే మామిడి ప్రపంచం అంతా ఎగుమతి చేయబడతాయి. కానీ ఈ సంవత్సరం మామిడి రైతులకు చేదు సంవత్సరం అనే చెప్పాలి. పంట సరిగా లేక నూజివీడు రైతులు ఆందోళన లో ఉన్నారు. దీనివల్ల పండిన పంటకు డిమాండ్ బాగా పెరిగి ఆ భారం వినియోగదారుల పైన పడింది. మామిడి రేట్లు ఆకాశాన్ని అంటాయి.

డజను మామిడి కాయలు ధర 400 పైగా ఉంది. మధ్య తరగతి వారు మామిడి కొనాలంటేనే చాలా ఆలోచించే పరిస్థితి వచ్చింది.
ఈ కారణంగా నూజివీడులో కంటే విజయవాడలోనే రేట్లు తక్కువ ఉండే పరిస్థితి ఏర్పడింది

223 total views, 6 views today