ఆవకాయ పెట్టడం ఒక పెద్ద పండగ

ఆవకాయ పెట్టడం ఒక పెద్ద పండగ

April 25, 2019 Off By nuzvidthemangocity

” ఆవకాయ పచ్చడి ఇదిమన నూజివీడు కి చిన్న పండగ లాంటిదిమిరపకాయలు తెచ్చి..ఆరపోసుకుని వలిచికారం కొట్టే మామ్మలు వచ్చిరోకళ్ళు తెచ్చి.కారం కొడుతుంటేమా అమ్ముమ్మ వాళ్ళకు సాయంచేయటానికి ఒక చేయ వేస్తేమద్యలో వాళ్ళకి టీ ఇస్తూమండుతున్న మొకాలు తుడుచుకుంటూఉప్పు ‌.ఆవాలు..కొట్టిఅన్ని ఒక దగ్గర కి చేర్చిఇంక మామిడి కాయలు కోసంవేటాడి..చిన్న రసాలు కానినాట్లు కానీసువర్ణ రేఖలు కానీతెల్ల గులాబీలు కానీవేటాడి వలలో చిక్కిన జింగలాగబస్తాలో పెట్టుకుని తెచ్చిముక్కలు కొట్టిమద్యలో జీడీ పిల్లలు అందరు తీయటానికి పోటీ పడేలా తాళంమద్యలో అమ్ముమ్మ చూడకుండా కొన్ని ముక్కలనుదాచుకొని..కారం అద్దుకునితినేవాళ్ళం..పచ్చడి అంతా తయారి అయ్యాక..కాళి గిన్నెలో వేడి అన్నం కలిపి అమ్ముమ్మముద్దలు పెడుతుంటే..కమ్మగా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం3 వ రోజు తిరగ కలిపే రోజు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండే వాళ్ళంఎందుకంటే అమ్ముమ్మమళ్లీ ఆవకాయ అన్నం కలిపి పెడుతుంది అని..ఇలా అందరూ కలిసి ఆవకాయ పండగ చేసుకునే వాళ్ళంఇప్పుడు అంతా..రెడిమెడ్ ప్రపంచంలో బతుకుతున్నాం..ఏమి అంటారు”

208 total views, 3 views today