నూజివీడు నియోజకవర్గ నామినేషన్ ప్రక్రియ పూర్తి.

నూజివీడు నియోజకవర్గ నామినేషన్ ప్రక్రియ పూర్తి.

March 22, 2019 Off By nuzvidthemangocity

నూజివీడు నియోజకవర్గ ఎలక్షన్ నామినేషన్ వేయడానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉద్యమం లాగా వెళ్లారు. వైస్సార్సీపీ అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు, టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మరియు జనసేన అభ్యర్థి బసవ భాస్కర రావు ముగ్గురు కూడా  తమ తమ వర్గం ప్రజలను భారీ సంఖ్యలో వెంటబెట్టుకుని పెద్ద ర్యాలీ చేసుకుంటూ నామినేషన్ వేసి వచ్చారు. 


ముగ్గురు వారి బలాన్ని నిరూపించుకోవడానికి ఈ అవకాశాన్ని వాడుకున్నారు. దీని వల్ల కాస్త ట్రాఫిక్ సమస్య నెలకొన్న మాట నిజమే.  ఏది ఏమైనా ఎలక్షన్ ఫలితాలు వెలువడ్డాకే ఎవరి బలం ఎంతో తెలుస్తోంది. అప్పటిదాకా ఎవరి సర్వే లెక్కలు వారికి అనుకూలంగా ఉంటాయి.

196 total views, 6 views today