నూజివీడులో వేసవి తాకిడికి ప్రజలు విల విల – వృక్షో రక్షతి రక్షితః

నూజివీడులో వేసవి తాకిడికి ప్రజలు విల విల – వృక్షో రక్షతి రక్షితః

May 8, 2019 Off By nuzvidthemangocity

ప్రతి సంవత్సరం కన్నా ఈ సారి ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రతి సంవత్సరం ఎండ 0.5℃ పెరుగుతూ ఉంటుంది అనేది నిపుణుల సూచన. నూజివీడులో కూడా ఈ సారి ఎండలు 43℃ పైగా ఉన్నాయి. వాటి నుంచి కాపాడుకోడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మీద కొబ్బరి మట్టలు వేసుకుని వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయో ఉహించుకోవచ్చు. 

ఆగిరిపల్లి కొండ మీద ఉన్న చెట్లు ఎండలకు మోడు బారిపోయాయి.

నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ రోడ్డు లో ఇది వరకు ఎన్నో చింత చెట్లు ఉంది చాలా చల్లగా ఉండేది. ఇపుడు ఆ రోడ్డు లో కూడా చెట్లు అన్ని కొట్టివేయబడ్డాయి.ఈ వేసవి ఎండల బారి నుండి గ్లోబల్ వార్మింగ్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే చెట్లు మరల తిరిగి పెంచడం తప్ప వేరొక మార్గం లేనట్టే.

231 total views, 6 views today