మండిపోతున్న నూజివీడు ఎండలు

మండిపోతున్న నూజివీడు ఎండలు

May 6, 2019 Off By nuzvidthemangocity

ఈ సంవత్సరం నూజివీడులో ఎండలు అత్యధికంగా ఉన్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీలు ఉన్న ఎండ మే వచ్చేసరికి 43 44 డిగ్రీలు ఉంది.
మధ్యాహ్నం 12 తర్వాత రోడ్ల మీద అసలు జనసంచారమే లేదు. చాలా మంది చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేసి రోడ్డుపైన తిరుగుతున్న వారిని కాస్త చల్లబరిచిన ఈ ఉష్ణోగ్రతకి అవి ఎక్కువసేపు పనిచేయడం లేదు. ఈ వడగాల్పులకి పసిపిల్లలు ముసలివారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

అందరూ వేసవికి కావాల్సిన కొన్ని చిట్కాలు పాటిస్తే ఎటువంటి సమస్య ఉండదు. శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. సూర్యుని బీభత్సం రానున్న రోజుల్లో ఇంకా ఉండొచ్చు. అత్యధికంగా 46 డిగ్రీలు ఉండొచ్చు అని అంచనా.

218 total views, 6 views today