నూజివీడు జనసేన అభ్యర్ధిగా బసవ భాస్కర రావు!

నూజివీడు జనసేన అభ్యర్ధిగా బసవ భాస్కర రావు!

March 19, 2019 Off By nuzvidthemangocity

నూజివీడు రాజకీయాల్లో ఒకేసారి వేడి మొదలయ్యింది. బసవ వర్గం వార్డు మెంబెర్లు  YSRCPకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.బసవ భాస్కరరావు గారు జనసేన కండువా కప్పుకున్నారు. వెంటనే జనసేన అధ్యక్షుడు పవనకళ్యాన్ గారు, నూజివీడు MLA అభ్యర్థి గా భాస్కరరావు గారిని ప్రకటించారు. నూజివీడు సీటు ని మొదట CPI కి కేటాయించిన జనసేన పార్టీ, బసవ వర్గం చేరికతో మార్పులు చేసింది.దీని వలన ప్రతాప్ అప్పారావు గారికి వచ్చే ఓటు బ్యాంకు లో కొంత చీలిక వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎలక్షన్స్ కి చాలా తక్కువ సమయమే ఉండటం వలన ఇపుడు వచ్చిన కొత్త అభ్యర్థి ఫలితాల పైన ఏ రకంగా ప్రభావం చూపుతారనేది వేచి చూడాలి.మరొక వైపు TDP అభ్యర్థి ముద్దరబోయిన గారు చాలా కాలం బట్టి నియోజకవర్గ స్థాయిలో బాగా తీరుగుతున్నారనేది తెలిసిన విషయమే.

184 total views, 6 views today