నూజివీడు దసరా 2018 విశేషాలు | Nuzvid Dasara 2018 highlights

నూజివీడు దసరా 2018 విశేషాలు | Nuzvid Dasara 2018 highlights

October 23, 2018 Off By nuzvidthemangocity

నూజివీడులో ఈ సంవత్సరం దసరా కూడా చాలా బాగా జరిగింది. ఊరంతా జనాలతో కోలాహలం, ఉరేగింపుల హడావిడి, బుట్టబొమ్మలా ఆట, బొమ్మల కొట్లు, చెడుగుడు పందాలు, అమ్మవారి అలంకరణలు ఇలా అన్ని హంగులతో దసరా కి నూజివీడు పెట్టింది పేరు అని మరొక సారి రుజువయ్యింది.
దేశం లో ఏ మూల ఉన్న దసరా పండక్కి అందరు వచ్చి నూజివీడు లో వాలిపోవాల్సిందే. అదే అదనుగా బస్సు రేట్లు బాగా పెంచేశారు అనుకోండి. ఏది ఏమైనా దసరా రోజు నూజివీడు రోడ్లలో తిరుగుతూ, బుర్రు బుర్రు అంటూ బూర ఊదటం, ఎక్సిబిషన్లో సాహసాలు చేయడం, ఇంట్లో పిండి వంటలు తినడం ఇవన్నీ జీవితం లో మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

2018 నూజివీడు దసరా విశేషాలు ఈ వీడియోలో చూడవచ్చు.

603 total views, 3 views today