నూజివీడులో వర్షపు జల్లులు

నూజివీడులో వర్షపు జల్లులు

July 8, 2019 Off By nuzvidthemangocity

నూజివీడులో వర్షాలు మొదలయ్యాయి. అనుకున్న తరహాలో వర్షపాతాహం లేకపోయినా, ఒక మోస్తరుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. రైతులు పొలాలు దున్నటం మొదలు పెట్టారు. వర్షపాతం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉండగా వర్ష కాలం లో అందరు ఎదుర్కొనే సమస్య కరెంటు కొత్త. నూజివీడు లో ఐతే కొంచెం చినుకులు పడిన కొంచెం గాలి వీచిన టపీమని కరెంటు తీసేస్తున్నారు.


నూజివీడులో మరొక పెద్ద సమస్య ఇక్కడ ఉన్న రోడ్లు. ప్రతి సంవత్సరం రోడ్లు వేస్తూనే ఉంటారు అవి వర్ష కలం లో కొట్టుకుని పోతూనే ఉంటాయి. గుంతలు ఉన్న రోడ్లలో వెళ్లడం వల్ల ప్రమాదాలు చాల జరుగుతున్నాయి.
వర్షాకాలం లో ఎవరైనా రోడ్ల మీద నెమ్మదిగా వెళ్ళాలి. ఎక్కడ గుంతలు ఉంటాయో అర్ధం కానీ రోడ్డు, వీధిలో దీపాలు వెలగవు అదీకాక ఇష్టం వచినట్టు బండ్లు నడిపే కుర్రకారు. కాస్త జాగ్రత్తగా ఉండండి! వర్షాలు సక్రమంగా పది రైతులకి ఆనందం చేకురాలని ఆశిద్దాం.

30 total views, 3 views today