నూజివీడులో పెరుగుతున్న మార్కెట్ కల్చర్

నూజివీడులో పెరుగుతున్న మార్కెట్ కల్చర్

July 6, 2019 Off By nuzvidthemangocity

నూజివీడులో కొత్తగా అనేక పేరొందిన మార్కెట్లు వస్తున్నాయి. పొట్టి శ్రీ రాములు బొమ్మ సెంటర్ లో ఆంధ్ర బ్యాంకు ఎదురుగ రిలయన్స్ ట్రెండ్స్ పెట్టారు. తర్వాత సిరి ఆర్కేడ్ ఎదురుగ హెరిటేజ్ ఫ్రెష్ అండ్ బస్సు స్టాండ్ సెంటర్ లో విలేజ్ ఫ్రెష్ ఇలా అనేక రకాల మార్కెట్లు వస్తున్నాయి.


ఇంక మొబైల్ షాపుల సంగతి చెప్పకర్లేదు. దాదాపుగా అన్ని రకాల కంపెనీ ల షో రూమ్ లు వచేసినట్టే నూజివీడులో. బైక్ లు, కార్లు, బట్టలషోరూంలు, డిఫరెంట్ రెస్టౌరెంట్స్, ఐస్ క్రీం పార్లోర్స్…ఇలా అన్ని రకాలుగా నూజివీడులో మార్కెట్ పెరుగుతుందనే చెప్పాలి.

ఇంతక ముందు ఏదయినా రిపేర్ అంటే చాలు ప్రతి దానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంక ఆ అవసరం లేదు. దాదాపుగా అన్ని సర్వీస్ సెంటర్స్ నూజివీడులో వచ్చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నూజివీడుకి కాస్త ప్రాముఖ్యత పెరిగింది అనే చెప్పాలి కానీ దాన్ని మన నాయకులు సరైన రీతిలో వినియోగించుకుంటే నూజివీడులో ఇంక చాల సంస్థలు పెట్టుబడి పెట్టవచ్చు.

215 total views, 12 views today