నూజివీడు శివాలయం లో నాగులచవితి పూజలు

నూజివీడు శివాలయం లో నాగులచవితి పూజలు

November 12, 2018 Off By nuzvidthemangocity

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడుజరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే … అందులో భాగంగానే ‘ నాగుపాము” ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

నూజివీడు శివాలయం లో కూడా నాగులచవితి పూజలు ఎంతో నిష్ఠగా చేస్తారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసం నాడు నూజివీడు శివాలయాలు దీపాలతో నిండిపోతాయి. అయ్యప్ప దీక్షను ధరించిన స్వాములు నిప్పుల గుండం లో నడిచి తమ భక్తిని చాటుతారు. అందరికి కార్తీక మాసం మరియు నాగుల చవితి శుభాకాంక్షలు

98 total views, 1 views today